1, ఆగస్టు 2012, బుధవారం

షడ్ దర్శన పరిచయము


మనకి ఆస్తిక దర్శనములు ఆరు, అవి: న్యాయము, వైశేషికము, పూర్వమీమాంసా, ఉత్తరమీమంసా, యోగము, సాంఖ్యము.
ఆస్తికత్వం అంటె ఇహపరములైనటువంటి లోకములు ఉన్నయనే నమ్మిక. ఈ దర్శనాలన్నింటి యొక్క పరమర్థము ఒక్కటే అది 'మోక్ష్షం'. మరి ఇన్ని దర్శనాలు ఎందుకు?.... లక్క్హ్యం ఒక్కటె కదా? అంటె, మోక్షనికి చెప్పేటటువంటి మార్గములు భిన్నముగా ఉంటాయి, ఎట్లనిన  


న్యాయము


న్యాయశాస్త్రమునందు ముఖ్యముగ పదార్థవిచారణ జరుగుతుంది.మోక్షము తత్త్వజ్ఙానము వలన కలుగుతుంది అన్నది సిధాంతము. లోకములోని పదార్థముల తత్త్వం తెలిసిన తరువాత...మిథ్యాజ్ఙానం నశించినతరువాత ప్రాబ్ధము నశించిన తరువత చివ్వరిదైన దుఃఖము యొక్క నాశనము అయినటువంతి మోక్షము కలుగుతుంది అని వీరి సిధాంతం.  ఈ దర్శనప్రవర్తకులు గోతమ ముని. 


వైశేషికము    


వీరిది కూడా న్యయము వారి తరహాగనె ఉంటుంది కాని సిధాంతలలొ సూక్ష్మ భెదములు ఉంటాయి. ఈ దర్శనప్రవర్తకులు కణాద ముని. 


పూర్వమీమాంసా  

ఈ దర్శనమునందు ముఖ్యముగ యఙ్ఞ యాగాదుల గురించి చర్చించ బడుతుంది. ఈ దర్శన ప్రవర్తకులు జైమినీయ ముని.


ఉత్తరమీమంసా(వేదాంతము)

ఈ దర్శనమునందు నిర్గుణోపాసనము గురించి ఆత్మజ్ఞానము గురించి వివరించబడుతుంది. శంకరాచర్యుల చేత  ప్రవర్తింపబడినటువంటి మతం అద్వైతం, మధ్వాచార్యుల చేత ప్రవర్తింపబడినటువంటి మతం ద్వైతం, రామనుజులచేత ప్రవర్తింపబడినటువంటి మతం విశిష్టాద్వైతం.

సాంఖ్యం

ఈ దర్శనమునందు మోక్షమునకు యోగ సాధనము మార్గముగా చెప్పబడుతుంది. కాకపొతే ఈ దర్శనమునందు ఈశ్వరుడను అంగీకరించరు. కపిల ముని దర్శన ప్రవర్తకులు.

యోగము

ఈ దర్శనమునందు మోక్షమునకు యోగ సాధనము మార్గముగా చెప్పబడుతుంది. కాకపొతే ఈ దర్శనమునందు ఈశ్వరుడను అంగీకరిస్తారు. పతంజలి ముని దర్శన ప్రవర్తకులు.








3 కామెంట్‌లు: