8, ఆగస్టు 2012, బుధవారం

'ఆత్మ' అంటే ఏమిటి?


సాధారణంగ ఆత్మ అనే పదాన్ని చాల చొట్ల వింటుంటాము......వినగానే ఏదో అర్థమయ్యీ అవ్వనట్లుగా ఉంటుంది!...అలగే నేనుఅన్నది కుడా వాడుతూ ఉంటాము. ఆత్మ అన్న పదానికి నేను అన్నది పర్యాయపదం అని చెప్పవచ్చు. మళ్ళి నేను అంటే ఏమిటి?...."నేను మగవాడిని/ఆడదానను", "నేను మష్యుడను", "నాకు బాధ కలిగింది/సంతోషం వేసింది", "నాకు కోపం వచ్చింది", అని అంటుంటాము...ఇక్కడ "నేను" అన్నదనికి అర్థం ఏంటి?....ఒకవేళ శరీరం అర్థం అని అందామా అంటే....నా చెయ్యికి దెబ్బ తగిలింది అంటామే తప్ప....చెయ్యిని చూపిస్తూ నాకు దెబ్బ తగిలింది అని సహజంగ అనము.... అట్లాగే ఎవడైన మనల్ని కొట్టినప్పుడు "వాడు నన్ను కొట్టాడు" అని అంటాము.....సొ ఒక్కొక్కసారి శరీరాన్ని ఉద్దేశించి, ఒక్కొక్కసారి ఇంకేదొ పదార్థాన్ని ఉదేశించి నేను అని వ్యవహరిస్తున్నాము...

చార్వకులలాంటి హేతువాదులు ఆత్మ అంటే శరిరము అనే అంటారు...పైన చెప్పిన వ్యవహారాలన్ని శారీరాన్ని ఉద్దెశించినవే అని అంటారు...అలాగే వాళ్ళు పునర్జన్మ, ధర్మము, అధర్మము లాంటివి ఎమి ఉండవు. పుట్టింది - బ్రతికేది సుఖము అన్నదాన్ని పొందటానికి కాబట్టి  "ఋణం కృత్వా ఘ్రుతం పిబేత్" అంటే అప్పు చేసి నెయ్యి తాగమని చెప్తారు...ఇక్కడ నెయ్యి అనేది సుఖమునకు పర్యాయము అని చెప్పవచ్చు....

కాబట్టి ఆత్మ అంటే ఏమిటి అంటే: ఆత్మ శరీరం కాదు......అది ఆకాశం(space) లాగ అన్ని చొట్ల వ్యాప్తమయ్యి ఉండే ఒక పదార్థము....దాని యందె జ్ఞానము, సుఖము, దుఃఖము, కోరిక, ద్వేషము, ఇత్యాదులు ఏవైతే మనము కళ్ళతొ చూడలేమో కనీ అనుభవించగలమో అవి ఉంటాయి. "నాకు బాధ కలిగింది/సంతోషం వేసింది", "నాకు కోపం వచ్చింది" అన్న చోట్ల నేను అన్నపదానికి  పైన పేర్కొనబడిన ఆత్మనే అర్థము. "వాడు నన్ను కొట్టాడు" ఇత్యాది వ్యవహారములలోని నేను అన్నపదానికి శరీరమే అర్థం....మరి నేను అని ఎల ప్రయొగిస్తున్నము అంటే...... అజ్ఙానము వలని అంటే నేను అన్న పదానికి ఆత్మ అర్థము, ఆత్మ వేరు శరీరము వేరు అన్న వివేచన లేకపోవడం వలన confuse అవటం మూలాన అట్లా ప్రయోగిస్తున్నము.      

ఇటువంటి ఆత్మ నిత్యమైనది...అనగా మన శరీరముల లాగ నశించిపోయేది కాదు. ఆత్మ 2 రక్కలు "జీవాత్మ" "పరమాత్మ" అని. మనవి "జీవత్మలు".....ఈశ్వరుడు "పరమాత్మ"....ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడొ....ఇంకో దేవుదో కాదు....వీరందరనూ సృజించీంటువంటి వాడు. శాస్త్రములలో "ఈశ్వర"పదముచేత ఇటువంటి ఈశ్వరుడే చర్చింపబడుతడు...
                                                            
జీవాత్మ

జీవాత్మనందే మనము చెసే మంచి పనులయొక్క ఫలములైనటువంటి "ధర్మము", చెడ్డపనులయొక్క ఫలములైనటువంటి "అధర్మము" ఉంటాయి. ఇటువంటి ధర్మాధర్మములే "అదృష్టం"గా కూడ వ్యవహరింపబడుతాయి. వీటియొక్క ఫలములె సుఖము దుఃఖము. ఇటువంటి ఆత్మను అంగీకరించడం వలన చాల ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఎందుకంటే అత్మ అనేది ఒక వారధి లంటిది....ఎట్లాగంటే రోజూ చాలమంది పుడుతున్నరు...కాని ఒక్కళ్ళు ధనవంతుల కుటుంబంలొ ....ఇంకొక్కళ్ళు మురికివాడలలొ జన్మిస్తున్నరు ఇలా ఎందుకు తారతమ్యాలు అన్ని చోట్ల ఉన్నాయి?...ఒక్క పుట్టుకలలొనె కాదు ప్రతీ విషయంలొ...ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుంది....తల్లి తండ్రి చనిపోయి ఉంటారు కాని వాళ్ళ పిల్లాడు పక్కనే దెబ్బలేమీ తగలకుండా పక్కన బ్రతికి ఉంటాడు.....ఇలా ఎందుకు జరుతుంది?......ఏక్కడో దేశంలో వర్షాలు పడవు...అదే కాలంలొ ఒక దేశంలొ అతివృష్టి ఉంటుంది రెండు చోట్లా ప్రజలు అలమటిస్తూ ఉంటారు....మూడో దేశంలొ అంతా సవ్యంగానే ఉంటుంది....ఎందుకు?..అని ప్రశిస్తే ఇప్పటి శాస్త్రవేత్తలు కనిపించే కరణాలు చెప్తారు, కాని  ఆ కారణాలు ఎందుకు ఆ సమయనికి అల ఎందుకు ఇమిడాయి అంటే చెప్పటం కష్టం. ఆత్మని ధర్మా ధర్మలని అంగికరిస్తే పై ప్రశ్నలకి సమాధానలు దొరుకుతాయి. రోడ్డు ప్రమాదం దగ్గర ఆ పిళ్ళాడి ప్రారబ్ధం వలన తల్లిదండ్రులు లేకుండానే బ్రతకాలి. వర్షాల దగ్గరికొస్తే జనాదృష్తం అంటే ఆయా ప్రాంతాలలో ఉండే జనాల పాపపుణ్యాలు ఆయా అతివృష్తి అనావృష్తులకి కారణం. ఇది కేవలం ఐహికంగ ఆత్మని అంగీకరించటం వలన కలిగె చిన్న ప్రయోజనం అని చెప్పవచ్చు.           



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి