నయ్యాయికులు జగత్తు ఏడు పదార్థాలయొక్క సమ్మహారం అని భావిస్తారు. అవి: ద్రవ్యము, గుణము, కర్మ, సామన్యము, విశేషము, సమవాయము, అభావము.
ద్రవ్యము: పృథివీ, జలం, తెజస్సు, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు అని తొమ్మిది రకాలు.
గుణము: రూపము(రంగు), రసము(రుచి), గంధము(వాసన), స్పర్శ, సంఖ్య, పరిమాణము(size), పృథక్త్వము(తేడా), సంయొగము, విభాగము, పరత్త్వము(ఎక్కువతనము), అపర్త్త్వము(తక్కువతనము), గురుత్త్వము(gravity), ద్రవత్త్వము(పారుట), స్నేహము(కలిసి ఉండుటకు హేతువు), శబ్దము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇఛ్ఛ(desire), ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారము అని 24 రకాలు. ఇవి అన్ని పైన చెప్పినటువంటి ద్రవ్యములలొ ఉంటాయి. అంటె ప్రతీ ఒక్క ద్రవ్యంలొ ఉంటాయి అని కాదు...గుణములు ద్రవ్యములలొ మాత్రమే ఉంటాయి....వేరె పదార్థములలొ(కర్మాదులలో) ఉండవు అని అర్థం.
కర్మ అనగా క్రియా(motion)అని అర్ఠం. అది ఉత్-క్షేపణము, అపక్షేపణము, ఆకుంచనము, ప్రసారణము, గమనము అని 5 రకాలు. ఉత్-క్షేపణము అనగ పైకి వెళ్ళుట. అపక్షేపణమనగ కిందకి వెళ్ళుట. ఆకుంచనమనగ కుంచించుకుపోవటం, ముడుచుకోవటం. ప్రసారణమనగ విచ్చుకోవటం. గమనము అంటె పైచెప్పిన క్రియలకంటె వెరేవిధమైన క్రియలన్నీ అన్ని అర్ఠం. ఈ కర్మలు కూడ ద్రవ్యములయందే ఉంటాయి.
సామన్యము అనగ కొన్ని ఒకేరకమైన వస్తువుల యందు ఉండేటటువంటి ఒక ధర్మము. ఉదా: మనుష్యులయందు ఉండె సామాన్య ధర్మము 'మనుష్యత్త్వం'...పశువులయందు 'పశుత్త్వం'...అంటె కొన్ని పదార్ఠలని ఒక గాటికి చేర్చేది సామన్యము.
విశేషముని వేరే ఒక పోస్ట్ లొ సవివరంగా చెప్తాము. క్లుప్తంగ చెప్పవీలుకాదు.
సమవాయము అనేది ఒక సంబంధం. రెండు విడదీయరాని వస్తువుల మధ్యనున్న సంబంధమె సమవాయము. ఉదా: గులాబి పువ్వునకి దాని రంగుకి ఉండే సంబంధము సమవాయము. చర్మమునకు ఉండే తెలుపు-నలుపు-ఇత్యాది రంగులలి ఉండె సంబంధము. అదే పెన్ను తొ పూసుకునే రంగు కడుక్కుంటే పోతుంది....అక్కడ సిరాకి చర్మానికి సమవయము లేదు సమ్యోగమే ఉన్నది.
అభావము అంటే లేకుండుట. దీని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి పోస్ట్ అవసరం.
ఇట్లా జగత్తు వీటియొక్క సమహారమే.
ఈ మత రీత్యా ప్రపంచం లో ఉన్న వస్తువులన్నీ కూడానూ పైన పేర్కొన్న ఏడు పదార్థాలలోకే అంతర్భవిస్తాయి...
కుండ పృథివీలో కి, కాంతి(light) తేజస్సు లోకి ఈ రీత్యా ఉన్న వస్తువులను ఆయా పదార్థాలుగా
తెలుసుకోవడమే ఈ వివేచనము యొక్క ప్రయోజనము.
Dayachesi prati varam oka article pettagalarani manavi! veelaithe typographical errors sari chusukonagalaru.
రిప్లయితొలగించండిtappaka prayatninchedamu...
రిప్లయితొలగించండి